ఉప్పల్, మే 19: తెలంగాణ ఎంసెట్-2026లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన చిలుకనగర్ డివిజన్‌కు చెందిన మల్లాడి రుషిని కేటీఆర్ ఘనంగా అభినందించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ నివాసం నానక్‌రామ్‌గూడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రుషికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఎంసెట్ పరీక్షల్లో 156.63 మార్కులు సాధించి రాష్ట్రంలో తొలి ర్యాంక్ సాధించిన రుషి, కొండల్ రెడ్డి కుమార్తె. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని కేటీఆర్ కొనియాడారు. రుషి విజయం చిలుకనగర్ డివిజన్‌తో పాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని రుషి నిరూపించిందని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరియు విద్యార్థుల అంకితభావమే విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.తెలంగాణ విద్యార్థులు దేశ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారని ఎమ్మెల్యే పేర్కొంటూ, రుషి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Related Posts
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి
- admin
- November 29, 2025
- 0
ఉప్పల్ న్యూస్ – జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి వారి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ( టీయూడబ్ల్యూజే) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన […]
బాబుజి జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు : కార్పొరేటర్ బన్నాల
- admin
- April 5, 2025
- 0
బాబుజి జగ్జీవన్ రామ్ 117 వ జయంతిని పురస్కరించుకొని చిలుకానగర్ డివిజన్లోని షెడ్యూల్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ […]
దివంగత జర్నలిస్ట్ సురేష్ కుటుంబానికి రాగిడి లక్ష్మారెడ్డి ఒక లక్ష ఆర్థిక సాయం
- admin
- June 25, 2025
- 0
ఉప్పల్ న్యూస్ – హఠాత్తుగా మరణించిన సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు సురేష్ సంస్మరణ సభలో ప్రకటించిన విధంగా రూ 1 లక్ష రూపాయల చెక్కును మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి […]
