ఉప్పల్, మే 19: తెలంగాణ ఎంసెట్-2026లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన చిలుకనగర్ డివిజన్‌కు చెందిన మల్లాడి రుషిని కేటీఆర్ ఘనంగా అభినందించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ నివాసం నానక్‌రామ్‌గూడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రుషికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఎంసెట్ పరీక్షల్లో 156.63 మార్కులు సాధించి రాష్ట్రంలో తొలి ర్యాంక్ సాధించిన రుషి, కొండల్ రెడ్డి కుమార్తె. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని కేటీఆర్ కొనియాడారు. రుషి విజయం చిలుకనగర్ డివిజన్‌తో పాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని రుషి నిరూపించిందని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరియు విద్యార్థుల అంకితభావమే విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.తెలంగాణ విద్యార్థులు దేశ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారని ఎమ్మెల్యే పేర్కొంటూ, రుషి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Related Posts
ఉప్పల్ సీఐ ( ఎస్ హెచ్ ఓ ) గా బాధ్యతలు స్వీకరించిన కే భాస్కర్
- admin
- August 12, 2025
- 0
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ నూతన సి ఐ ( ఎస్ హెచ్ ఓ ) గా బాధ్యతలు స్వీకరించిన కె. భాస్కర్, పోలీస్ స్టేషన్‌కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా భాస్కరను […]
సెంటెన్స్ స్కూల్ వద్ద ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ ధర్నా
- admin
- June 24, 2025
- 0
ఉప్పల్ న్యూస్ – అనుమతులు లేకుండా స్కూల్ నడుపుతున్న సెంటెన్స్ స్కూల్ వద్ద ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ధర్నా నిర్వహించారు.విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న స్కూల్ నీ వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ […]
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు : కార్పొరేటర్ బన్నాల
- admin
- March 30, 2025
- 0
రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, అనంతరం వారు మాట్లాడుతూ పవిత్ర […]
