ఎన్‌టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా రక్తదాన

  • 24వ సారి రక్తదానం చేసిన పబ్బతి శేఖర్ రెడ్డి

హైదరాబాద్: నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో ఉప్పల్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పబ్బతి శేఖర్ రెడ్డి పాల్గొని 24వ సారి రక్తదానం చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్‌టీఆర్ ఆశయాలను స్మరిస్తూ, సమాజ సేవే ధ్యేయంగా నిరంతరం రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *