
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. పర్వదినం క్రిస్టియన్ సోదరుల అందరికి శుభం చేకూరాలని, కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.
