
ఉప్పల్ న్యూస్ – సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం పురస్కరించుకొని ఉప్పల్ లో రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్, రన్ ఫర్ యూనిటీ ను ప్రారంభించిన సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, డిసిపి పద్మజ, ఎవరెస్ట్ అధిరోహించిన అన్విత రెడ్డి,అథ్లెంటిక్ కల్పన, వీరు జండా ఊపి రన్ ను ప్రారంభంచారు. ఈ రన్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వరకు నిర్వహించారు.ఈ రన్ భారతదేశంలో ఉన్న పౌరులు అందరూ ఏకతాటి పై ఉన్నారు అని తెలియజేయడానికి రన్ ఫర్ యూనిటీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు, జర్నలిస్ట్లు, ప్రజలు పాల్గొన్నారు.
