
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ నూతన తహసీల్దార్‌గా నియమితులైన పూల్ సింగ్ చౌహాన్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కార్యాలయంలో సిబ్బంది,స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు,సర్వే సిబ్బంది తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఉప్పల్ మండల ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలు సమర్థంగా చేరేలా కృషి చేస్తానని తెలిపారు.పారదర్శకత, ప్రజా సంతృప్తి ప్రధాన లక్ష్యంగా తీసుకొని వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు.ఇంతకుముందు ఉప్పల్ తహసీల్దార్‌గా సేవలందించిన వాణి రెడ్డి బదిలీపై బాచుపల్లి మండలానికి వెళ్ళారు. ఆమె సేవలను సిబ్బంది,స్థానిక ప్రజలు ప్రశంసించారు.
