రామంతాపూర్ కరెంట్ షాక్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

  • కోటి రూపాయల నగదు మరియు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

రామంతపూర్ న్యూస్- రామంతాపూర్ కరెంట్ షాక్ ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. గోకుల్ నగర్ లో శ్రీకృష్ణ శోభాయాత్రలో విద్యుత్ షాక్ తో 5 గురు మృతి చెందడం బాధాకరం అని ఎమ్మెల్యే తెలిపారు.మృతులు రాజేంద్రరెడ్డి, వికాస్, శ్రీకృష్ణ, శ్రీకాంత్, సురేష్ యాదవ్ కు సహాయం అందజేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలవడం జరిగింది. చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు మరియు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అలాగే గాయపడ్డ వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి అని ఆయన అన్నారు.వారు కోలుకునే వరకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం తరఫున వారికి అన్ని విధాలా అండగా ఉంటాను అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *