
రాంపల్లి న్యూస్ – నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మేడ్చల్ జిల్లా డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎం. రాధికా
అన్నారు. రాంపల్లి డబల్ బెడ్ రూమ్స్ నందు మంగళవారం నాడు ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ అభ్యర్థన మేరకు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది ఈ మేళా లో సుమారు 20 కంపెనీలు పాల్గొని యువత వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించారు ఈ మేళాలో సుమారు 300 మంది మహిళలు, యువకులు పాల్గొని దరఖాస్తు చేసుకోవడం జరిగినది కొంతమందికి అక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రాధిక మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలన్నారు. దాని కోసమే నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ కంపెనీలో యువకులు, యువతులు పని చేయాల్సి ఉంటుందన్నారు. రాంపల్లి డబల్ బెడ్ రూమ్ వాసులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నట్లు తెలిపారు. జాబ్ మేళా కు యువతులు పెద్దఎత్తున తరలిరావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.