
. రామంతపూర్ న్యూస్,- రామంతపూర్ డివిజన్లో అభివృద్ధి పనులలో భాగంగా బుధవారం నాడు ఏడిఆర్ యం హాస్పిటల్ నుండి కార్డినల్ గ్రేసెస్ స్కూల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు పాల్గొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు . బుధవారం నాడు ప్రారంభమైన ఈ రోడ్డుకు రూ.1 కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేయబడింది. అని తెలిపారు, ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు బాలరాజు , కాపర్తి మోహన్, రమేష్, బిజెపి నాయకులు కుమార్ స్వామి, నిరంజన్ గౌడ్, దయాకర్ రెడ్డి కృష్ణమూర్తి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గంధం నాగేశ్వర్ రావు ,పవన్, మహమ్మద్ జాంగిర్, మంజుల, ఇందిరా, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.