
ఉప్పల్ న్యూస్ – హఠాత్తుగా మరణించిన సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు సురేష్ సంస్మరణ సభలో ప్రకటించిన విధంగా రూ 1 లక్ష రూపాయల చెక్కును మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి .దివంగత జర్నలిస్ట్ సురేష్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు. బుధవారం నాడు కుటుంబ సభ్యులకు నేరుగా అందజేసేందుకు ఉప్పల్ ఈస్ట్ కళ్యాణ్పూర్ లోని సురేష్ ఇంటికి లక్ష్మారెడ్డి, చిలకనగర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బన్నాలు ప్రవీణ్ మరియు సంతోష్ ఇతర అనుచరులతో కలిసి వచ్చి అందజేశారు, ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ఈ సహాయంతోనే ఆగకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు