
ఉప్పల్ న్యూస్ – .ఉప్పల్ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి తన వంతు తోడ్పాటు అందిస్తానని ఐటీ శాఖ మంత్రి, మేడ్చల్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ సమస్య పరిష్కారానికి సహకారం అందిస్తామని తెలిపారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు, జర్నలిస్టుల ఇండ్ల పట్టాల సమస్యల పరిష్కరించాలని కోరుతూ టి యు డబ్ల్యూ జే మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి శ్రీధర్ బాబును మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కలిశారు . ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జర్నలిస్టుల ఇళ్ల పట్టాలు, ఇతర అంశాలపై చర్చించారు . ఉప్పల్ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు జర్నలిస్టులకు అండగా ఉంటూ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనది అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టుల కు తగిన సహకారం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్ , ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.