— సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్, కాలనీ వాసులు
— పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి

ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ లో ఎంతో కాలంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభించునుంది. నాడు మల్కాజ్‌గిరి ఎంపీగా, నేడు సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి ఉప్పల్ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమస్యల పరిష్కారం కోసం అహర్నిషలు కృషి చేసే ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందముల పరేమేశ్వర్ రెడ్డి సారధ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా కావాల్సినన్ని నిధులను మంజూరు చేయిస్తున్నారు. ఉప్పల్ డివిజన్‌లోనూ కార్పోరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెండింగ్ పనులకు సైతం చకచకా అనుమతులు రావడంతో పాటు వేగంగా పనులు జరుగుతున్నాయి. ఉప్పల్ అభివృద్ది కోసం రూ.10కోట్ల ప్రత్యేక ఫండ్ ఇవ్వగా ఆ తర్వాత జంక్షన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఉప్పల్ లో రూ.27 కోట్లతో నల్లచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఉప్పల్ డివిజన్‌లో డ్రైనేజీ సమస్యకు చెక్ పెట్టేందుకు రూ. 4కోట్ల నిధులు మంజూరు చేశారు. ఉప్పల్ డివిజన్ లో చాలా రోజులుగా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ఇబ్బందిపడుతున్న ఆనంద్ నగర్ కాలనీ, పద్మావతి కాలనీ, సెవన్ హిల్స్ కాలనీ, వెంకటేశ్వరకాలనీ వాసుల ఇబ్బందులకు రూ.4 కోట్ల నిధులతో చేపట్టే పనులతో శాశ్వత పరిష్కారం లభించనుంది. మంగళవారం ఈ పనులను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందముల పరమేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్ మందముల రజితాపరమేశ్వర్‌రెడ్డి, వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. తమ కాలనీలో ఎంతో కాలంగా ఎవరికీ పట్టని సమస్యగా ఉన్న డ్రైనేజీ ఇబ్బందిని తీరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి కాలనీల వాసులు ధన్యవాదాలు చెప్తూ, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డిని కలిశారు. సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు సత్యనారాయణ, ఏ ఎమ్ హెచ్ ఓ రంజిత్ ,మోదుగు మోహన్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి (పద్మావతి కాలనీ అధ్యక్షులు ) బకారం లక్ష్మణ్ ,సెవెన్ హిల్స్ కాలనీ అధ్యక్షులు శ్రీధర్ గుప్తా ,వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు నరసింహ చారి ,అంజి రెడ్డి ,బాను ప్రకాష్,తుమ్మల దేవి రెడ్డి,సల్ల ప్రభాకర్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,శ్రీనివాస్ ,ఎల్లయ్య సత్తయ్య ,తుమ్మల దేవేందర్ రెడ్డి,వెంకటేష్ గౌడ్ ,సాంబశివుడు,బోడిగా మల్లేష్ గౌడ్,మురళి అంజయ్య ,విజయేందర్ రెడ్డి ,కొండల్ రెడ్డి,రామకృష్ణ గౌడ్,నర్సింహ రెడ్డి,రాములు నారాయణ తదితరులు పాల్గొన్నారు.