
ఉప్పల్ న్యూస్ – సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకున్న ఉప్పల్ పోలీసులు మంగళవారం నాడు ఉదయం సుమారు 11 గంటల సమయంలో రామంతపూర్ లోని డి మార్ట్ వద్ద అనుమానాస్పదంగా సైకిల్ తో వెళ్తున్న ఒక వ్యక్తిని ఉప్పల్ పోలీస్ వారు పట్టుకొని అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా ఆ వ్యక్తి గత 20 రోజుల నుండి ఉప్పల్లోనీ బాలాజీ ఎన్క్లేవ్ కాలనీ, సాయిరాం నగర్ కాలనీ మరియు ధర్మపురి కాలనీలోని ఇండ్లలో అర్ధరాత్రి వేళ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిసింది అతని వద్ద నుండి మూడు సైకిళ్లను మరియు ఒక సెల్ ఫోన్ ను ఉప్పల్ పోలీసు వారు స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినారు నిందితుడి వివరాలు అతని పేరు సుంచు సాల్మన్ రాజు తండ్రి పేరు వాపస్ వయసు 46 సంవత్సరాలు వృత్తి క్యాటరింగ్ వర్క్ నివాసం కుషాయిగూడ ఏరియాలోని ఫుట్ పాతుల పైన రాత్రి వేళలో ఉంటాడు సొంత ఊరు హనుమాన్ టెంపుల్ దగ్గర వీకర్ సెక్షన్ కాలనీ కర్నూలు టౌను ఆంధ్రప్రదేశ్ ఇతడు గతంలో కూడా జవహర్ నగర్, కుషాయిగూడ మరియు కీసర పోలీస్ స్టేషన్ల పరిధిలో సైకిల్ దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినాడు అని ఉప్పల్ పోలీసులు తెలిపారు