
ఉప్పల్ న్యూస్ – శుక్రవారం నాడు ఉప్పల్ 108 అంబులెన్సు లో మహిళా ప్రసవించడం జరిగింది ఆ మహిళకి పురుడు పోసిన ఉప్పల్ 108 అంబులెన్సు సిబ్బంది, వివరాల్లోకెళ్తే మేడిపల్లిలో నివాస ఉంటున్న లక్ష్మిన్ యాదవ్ భర్త మహేష్ యాదవ్ గర్భవతి అయిన ఆమె పురుటి నొప్పులు రావడంతో ఇబ్బంది పడుతూ 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు, సమాచారం అందుకున్న ఉప్పల్ 108 సిబ్బంది హుటాహుటిన మేడిపల్లికి వెళ్లి గాంధీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుండగా, ఉప్పల్ దగ్గరలో ఆమెకి పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ లోనే ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు, తల్లి బిడ్డను ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాయిన్ చేయడం జరిగింది,108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు,పైలట్ ఉపేందర్ హాస్పిటల్లో చేర్పించడం జరిగినది