
ఉప్పల్ :మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండల పరిధిలోని ఉప్పల్ లో కళ్యాణపురి లోని సర్వే నెంబర్ 789 లోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను ఉప్పల్ ఎమ్మార్వో టి,వాణి రెడ్డి ఆదేశాల మేరకు ఆర్,ఐలు సామ్సన్ పాల్,ఎం,అశ్విని గౌడ్,జూనియర్ అసిస్టెంట్ ఎన్,నాగలక్ష్మి,ఎం,అలివేలు, రెవెన్యూ సిబ్బంది సత్యనారాయణ,స్వామి లు,భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు,3 రూమ్స్,కాంపౌండ్ వాల్ లను నేలమట్టం చేసినట్లు తెలిపారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూములను ఎవరు ఆక్రమించిన,ఆక్రమించేందుకు ప్రయత్నించిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు,ప్రభుత్వ భూమిని కబ్జా చేసి విక్రయానికి పాల్పడ్డ నిర్మాణాలు చేసిన ఊరుకునే ప్రసక్తే లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు,