- నివాళులర్పించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సీఎం రేవంత్ రెడ్డి తోనే సాధ్యమైంది – ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి,
ఉప్పల్ న్యూస్ – భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉప్పల్ క్రాస్ రోడ్డు లో కాంగ్రెస్ పార్టీ ఎస్.సి సెల్ అద్వర్యం లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి ,ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ,అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సీఎం రేవంత్ రెడ్డితోనే సాధ్యమైందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో దళితుల్లోని అన్ని కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రకాల అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనా వర్గీకరణ చేశారని గుర్తు చేశారు.. హోమ్ మంత్రి అమిత్ షా నిండు పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను, భారత రాజ్యాంగాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు.దేశంలో రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి సెల్ బ్లాక్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ ,ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్ ,బజారు జగన్నాథ్ గౌడ్ ,తుమ్మల దేవి రెడ్డి ,పసుల లూకాస్ ,ఖజా మౌలానా,నాగారం వెంకటేష్, లూకాస్,సుంకు శేఖర్ రెడ్డి, ప్రేమ్, బుసం రఘునాథ్ రెడ్డి,రాఘవేంద్ర గుప్తా, హనుమంతు, అల్వల భాస్కర్,గొరిగే మహేష్, గోపాల్, జనగాం రామకృష్ణ, ఆఫ్జాల్, అన్వార్,కంచమిది శ్రీనివాస్, మోహన్ నాయక్, ప్రశాంత్, చిన్నా,బాకారం అరుణ్, సుధాకర్,షేక్ వహీద్, వీరప్ప,నవీన్ యాదవ్,సురేష్, కుమార్,రాంచేందర్, కుమార్, మమతా ,సుశీల, రేణుక,కవిత వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు
