
ఉప్పల్, మార్చి 5 : ఉప్పల్ ప్రెస్ క్లబ్ కు తన వంతు సహకారం అందజేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ) మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి గడ్డమీది బాలరాజు, దొంతుల వెంకట్రాంరెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ని గురువారం నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కలిశారు. ఈ మేరకు రెండవసారి చైర్మన్ గా ఎన్నికైన సందర్బంగా మీడియా అకాడమీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చచం అందజేసి, శాలువా తో సత్కరించారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు వి.తిరుపతి రెడ్డి, కార్యదర్శి జి.శివాజీ లు కలిసి సీఎం రేవంత్ రెడ్డి , ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కూడిన మెమెంటో అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు సహకారం అందజేస్తామన్నారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అభినందించారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు..ఈ కార్యక్రమం లో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పారెల్లి సాగర్, ఉపాధ్యక్షులు శ్రీధర్ రావు, నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజు, ఓ.రమేష్ పాల్గొన్నారు.
