యూలర్ మోటార్స్ టర్బో ఈవీ 1000 ఆవిష్కరణ

  • ఇది ప్రపంచంలోనే మొదటి వన్ టన్ను ఎలక్ట్రిక్ ట్రక్

ఉప్పల్ అక్టోబర్ 13 ( నేటి సమాచారం ప్రతినిధి) ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన రంగంలో అగ్రగామి యూలర్ మోటార్స్ హైదరాబాద్‌ ఉప్పల్లో యూలర్ టర్బో ఈవీ 1000’ను ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే వన్ టన్ను ఎలక్ట్రిక్ ట్రక్కు. రూ.5.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ వాహనం వన్ టన్ను సర్టిఫైడ్ లోడ్ సామర్థ్యం, 140 నుంచి 170 కిలోమీటర్ల రియల్ రేంజ్తో వస్తుంది. డీజిల్ వాహనాలతో పోలిస్తే ప్రతి సంవత్సరం రూ.1.15 లక్షల వరకు ఆదా చేయవచ్చు. నగరంలోని రద్దీ రహదారులు, ఖర్చు పట్ల జాగ్రత్త గల డ్రైవర్లు, వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. దీంతో ఇది ప్రపంచంలోనే మొదటి అధిక పని తీరు, చవకైన ఎలక్ట్రిక్ మినీ ట్రక్‌గా నిలిచింది. హైదరాబాద్ వ్యాపార వాహన రంగంలో కొత్త దశను ప్రారంభించినట్టు అయింది. ఈ సందర్భంగా యూలర్ మోటార్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ సౌరభ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని వాణిజ్య రవాణా రంగం ఇప్పటి వరకు డీజిల్ వాహనాలపైనే ఆధారపడి ఉందన్నారు. అయితే, పెరుగుతున్న ఇంధన ధరలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న లాజిస్టిక్స్ కార్యకలాపాలు, విశ్వసనీయమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా అవసరాలు ఇవన్నీ స్వచ్ఛమైన ప్రత్యామ్నాయాలపై ఆసక్తిని పెంచుతున్నాయని తెలిపారు. ఈ మారుతున్న పరిస్థితులకు టర్బో ఈవీ 1000 పూర్తి స్థాయిలో సరిపోతుందన్నారు. ఇది నగరంలో చిన్న వాణిజ్య వాహన విభాగంలో ఉన్న లోటును పూరిస్తుందన్నారు. అధిక పనితీరు, విస్తృత రేంజ్, ఫ్లీట్ ఆపరేటర్లు, డ్రైవర్ ఎంటర్‌ప్రెన్యూర్లకు ఎన్నో ప్రయోజనాలు కలవన్నారు. నగరానికి అనుకూలంగా పలు ఈవీ విధానాలు అమలులో ఉన్నాయన్నారు. వీటిలో ముఖ్యంగా 2026 డిసెంబర్ వరకు అన్ని ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుపై 100 శాతం మినహాయింపు, 20,000 కొత్త వాణిజ్య ఈవీలకు అనుమతుల జారీ, హైవేలు, ఐటీ జోన్లు, ముఖ్య వ్యాపార ప్రాంతాల్లో పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాల విస్తరణ ఉన్నాయని చెప్పారు. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎలక్ట్రిక్ బస్సులు, ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద కేంద్ర సబ్సిడీలు, ఉచిత పబ్లిక్ పార్కింగ్, టోల్ మినహాయింపు ఉన్నాయన్నారు. ఈ చర్యలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఆర్థికపరంగా మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయని తెలిపారు. డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారే డ్రైవర్లు, వ్యాపారులకు ఎంతో నమ్మకాన్ని పెంచుతున్నాయన్నారు. ఈ ఈవీ అత్యుత్తమ పని తీరును ప్రదర్శిస్తుందన్నారు. ఇది 140 ఎన్ఎం టార్క్, 230 ఎంఎం డిస్క్ బ్రేకులు, ఆర్13 వీల్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిందన్నారు. ఈ సాంకేతికత డ్రైవర్లకు నగరంలోని కఠినమైన రోడ్లను సురక్షితంగా, వేగంగా, పూర్తి లోడుతో నడపగల నమ్మకాన్ని ఇస్తుందన్నారు. టర్బో ఈవీ 1000లో సీసీఎస్2 ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉందని చెప్పారు. ఇది పరిశ్రమలోనే మొదటిసారి కేవలం 15 నిమిషాల చార్జింగ్‌తో 50 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెప్పారు. దీని 2.5 ఎంఎం లాడర్ ఫ్రేమ్, ఐపీ67 రేటెడ్ బ్యాటరీ, ఎలక్ట్రానిక్స్, లేజర్ వెల్డెడ్ బ్యాటరీ మాడ్యూల్స్ వాహనానికి అధిక దృఢత్వం, విశ్వసనీయతను అందిస్తుందని పేర్కొన్నారు. డ్రైవర్లు ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి, డౌన్‌టైమ్ తగ్గించడానికి, రోజువారీ ఆదాయం పెంచుకోవడానికి సహాయపడతాయని తెలిపారు. ఇది హైదరాబాద్‌లోని చిన్న వాణిజ్య వాహన విభాగానికి ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుందన్నారు. తక్కువ ప్రారంభ ధర, తక్కువ ఖర్చులు, గణనీయంగా తగ్గిన టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్ కారణంగా ఆపరేటర్లకు సరైన ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. నగరంలోని రవాణా వ్యాపారులు బలమైన, విశ్వసనీయమైన, తక్కువ ఖర్చుతో నడిచే వాహనాలపై ఆధారపడుతున్నారని చెప్పారు. టర్బో ఈవీ 1000 ద్వారా వన్ టన్ను లోడ్ సామర్థ్యం, అద్భుతమైన పనితీరు, సంవత్సరానికి రూ.1.15 లక్షల వరకు ఆదా అందించే వాహనాన్ని అందిస్తున్నామన్నారు. ఇది డ్రైవర్లకు, వ్యాపారులకు ప్రతి ప్రయాణంలో అధికంగా సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుందన్నారు. మా ఈవీ హైదరాబాద్ నగరాన్ని మరింత సమర్థవంతంగా, లాభదాయకంగా, పర్యావరణహితంగా సరుకు రవాణా చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. టర్బో ఈవీ 1000 తొమ్మిది విభాగాలలో మొదటిసారి ప్రవేశపెట్టిన సాంకేతికతలను కలిగి ఉందన్నారు. ఇది యూలర్ మోటార్స్ నుంచి వచ్చిన మూడో ఉత్పత్తి, కంపెనీ రెండో నాలుగు చక్రాల వాణిజ్య వాహనం ఇదన్నారు. అంటే మొదటి 4డబ్ల్యు మోడల్ స్టార్మ్ ఈవీ తర్వాతి మోడల్ అన్నారు. ఈ వాహనం మూడు వేరియంట్లలో లభిస్తుందన్నారు. సిటీ రూ.5,99,999, ఫాస్ట్ చార్జ్తో రూ.8,19,999, మాక్స్ రూ. 7,19,999 ధరలలో ఉన్నాయన్నారు. కేవలం రూ.49,999 డౌన్ పేమెంట్‌తో నెలకు రూ.10,000 నుంచి ప్రారంభమయ్యే సులభమైన ఈఎంఐ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కమర్షియల్స్ షోరూమ్ ఓనర్ టి వెంకట్ రెడ్డి, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ వి.పి జగన్మోహన్ రెడ్డి, యూలర్‌ ఏరియా మేనేజర్ అబ్దుల్ వధుద్, యూలర్‌ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ పూర్వాక్ కపూర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *