
రాంపల్లి న్యూస్ – రాంపల్లి డబల్ బెడ్ రూమ్ వాసులకు డిస్టిక్ కోపరేటివ్ ఆఫీసర్ టి వెంకట్ రెడ్డి శుభవార్త తెలియజేశారు త్వరలోనే రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ సొసైటీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని ఆయన తెలిపారు గురువారం నాడు రాంపల్లి లోని డబల్ బెడ్ రూమ్ నందు 1 నుండి 15 ఓ బ్లాక్ వరకు నివాసం ఉంటున్న వారి నుండిమెంబెర్ షిప్ అప్లికేషన్ ఫామ్ ని స్వీకరించారు మిగిలిన అన్ని బ్లాక్స్ నుండి ఒకటి రెండు రోజుల్లో మెంబెర్ షిప్ అప్లికేషన్లు తీసుకుంటామని తెలిపారు, అన్ని బ్లాక్స్ మెంబర్స్ నుండి అప్లికేషన్ వచ్చిన వెంటనే వాటిని ధ్రువీకరించి ఓటర్ లిస్ట్ ప్రకటించి ఎలక్షన్ నిర్వహిస్తామని వెంకటరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు, ప్రస్తుతం మెంబర్షిప్ కోసం కలెక్ట్ చేస్తున్న అమౌంట్ నుండి ప్రతి మెంబర్ మీద 110 లు తిరిగి సొసైటీ అకౌంట్ లో జమ చేయబడుతుందని తెలిపారు, ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తం నుండి ఎలక్షన్ ఖర్చులు నిమిత్తం వాడబడుతుందని తెలియజేశారు మిగిలిన ప్రతి రూపాయలు సొసైటీ అకౌంట్లో జమ చేస్తారని తెలిపారు..
ఇప్పటివరకు ఉన్న బ్లాక్ ఇన్చార్జిలు రద్దు...
ఇప్పటివరకు ప్రతి బ్లాక్ ఇన్చార్జిల్గా ఉన్న వాళ్ళ పదవీకాలం ఒకసారి సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రద్దవుతుందని డిస్టిక్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ టి వెంకట్ రెడ్డి తెలిపారు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ప్రతి బ్లాక్ కి 9 మంది సభ్యులును ఎన్నుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు ముందు బ్లాక్ ఇన్చార్జిలు సభ్యులు ఎన్నిక తర్వాతనే సొసైటీ అధ్యక్ష కార్యదర్శులను మిగిలిన సభ్యులను ఎన్నుకోబడుతుందని ఆయన తెలిపారు ఎన్నిక అనంతరం ప్రతి బ్లాక్ ఇన్చార్జిలు సభ్యులు ప్రతినెల 5వ తారీఖు వరకు బ్లాకు సంబంధించిన ఆదాయ వ్యయం వివరాలను సొసైటీకి తెలియజేయాలని తెలిపారు ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తాన్ని దానికి సంబంధించిన పుస్తకాలను అన్నిటిని సొసైటీకు అందజేయాలని ఆయన తెలిపారు. తీసుకున్న ప్రతి రూపాయికి అకౌంట్బులిటీ ఉంటుందని ఎన్నికలు పారదర్శంగా జరుగుతుందని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్ టీ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు