
ఉప్పల్ న్యూస్ – భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని , ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు వెంటనే దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని కోరారు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.ప్రధానంగా వర్షం సమయంలో చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదన్నారు. అలాగే కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటు స్థంభాలు, ట్రాన్సాపార్మర్స్, ముట్టుకోరాదని కోరారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, చెరువుల వద్ద కు వెళ్ళరాదన్నారు. ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్లకు లేదా స్థానిక అధికారులకు సమాచారం అందించవలసిందిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశారు స్కూల్కు వెళ్లేటప్పుడు వర్షపు కోట్లు లేదా గొడుగులు ఉపయోగించండిరోడ్లపై నీరు చేరిన చోట్ల నడవడం లేదా ఆడుకోవడం నివారించాలని కోరారు అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళేప్పుడు రోడ్ల పరిస్థితి తెలుసుకోండి నీటితో నిండిన రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు వేగం తగ్గించాలని కోరారు. ప్రభుత్వ విభాగాలు, రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు.