
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ నూతన సి ఐ ( ఎస్ హెచ్ ఓ ) గా బాధ్యతలు స్వీకరించిన కె. భాస్కర్, పోలీస్ స్టేషన్కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా భాస్కరను నియమిస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ పని చేసిన ఎలక్షన్ రెడ్డిని కమిషనర్ ఆఫీస్కి అటాచ్ చేసిన విషయం విధితమే. మంగళవారం నూతన సి ఐ గా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తనకు తెలుపవచ్చు అని తెలిపారు.