
రామంతపూర్ న్యూస్ – రామంతపూర్ భగయత్ వెంకట సాయి నగర్ కాలనీ బీరప్ప దేవాలయం వెనకాల లైన్ లో సాంక్షన్ అయినటువంటి బాక్స్ కల్వర్ట్ ను అధికారులను తప్పుదోవ పట్టించి సాంక్షన్ అయినటువంటి బాక్స్ కల్వర్టు ను వెయ్యకుండా అడ్డుకుంటున్నారని ఈరోజు వెంకట సాయి నగర్ కాలనీవాసులు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని కలిసారు . ఈ మేరకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటే వారిపైనా న్యాయ పరమైన చర్యలు చేపడతామని అన్నారు . ఇప్పటికే రామంతపూర్ భగయత్ కాలనీలకు కోటి రూపాయలు మంజూరు చేయించి డ్రైనేజీ లైన్లు పూర్తి చేయించామని శాంక్షన్ అయినటువంటి బాక్స్ కల్వర్టు కూడా త్వరలో శంకుస్థాపన చేసి పనులను పూర్తి చేయిస్తాను అని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు గంధం నాగేశ్వరరావు , సర్వ సత్తయ్య యాదవ్, గోపాల్,ఆర్ .గోవింద్, ఏ విజయేందర్ రెడ్డి, శంకర్, శ్రీనివాస్ గౌడ్, అశోక్, నవీన్, కీర్తి ,చారి, సయ్యద్, చారి , తదితరులు పాల్గొన్నారు