రాంపల్లి డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు సౌకర్యాలు నిల్… ఎంక్వైరీస్ ఫుల్….

  • సరైనా రోడ్స్ లేవు
  • నీటి సమస్య
  • హాస్పిటల్ సమస్య
  • రవాణా సమస్య
  • పిల్లల చదువులకు పాఠశాలలు లేవు
  • కనీస అవససారాలు కరువు
Oplus_16908288

రాంపల్లి న్యూస్ – రాంపల్లి డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారి బాధలు వర్ణతీతం డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ సరైన అప్రోచ్ రోడ్ లేదు, హాస్పిటల్ సౌకర్యం లేదు, మంచి నీటి సౌకర్యం లేదు, పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ లేవు, నిత్యవసర సరుకులు కొనడానికి కనీసం రెండు మూడు కిలోమీటర్ల పోవాల్సిన పరిస్థితి, రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదు, ఇలా అనేక సమస్యలతో రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు, అసలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి నెలకు ఒక ఎంక్వైరీ పేరుతో పరేషాన్ చేస్తున్నారు, చప్పా చేయకుండా అందరూ ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలకు వెళ్లిన టైంకి వచ్చి ఎంక్వయిరీ అని వాళ్లకు ఇష్టం వచ్చినట్టు రాసుకొని పోతున్నారు, కనీసం నివాసం ఉంటున్నారా లేదా అని పక్కన వాళ్ళని కూడా అడగకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారని డబుల్ బెడ్ రూమ్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అనేకమంది తమ ఇళ్ళను తమ శక్తి మేరకు రిపేర్ చేపించుకొని కొత్త టైల్స్ సున్నం వేసుకున్న ఇళ్ళ ను కూడా అవి ఇప్పటి వరకు ఇచ్చినవారు స్వాధీనం చేసుకోలేదని రాసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు, ఎంక్వైరీ వచ్చినవాళ్లు అసలు వాటిలో ఉండడం లేదు అని రాసుకొని పోవడం ఎంతవరకు సభవు అని డబల్ బెడ్ రూమ్ వాసులు మొత్తుకుంటున్నారు, ప్రభుత్వం అన్ని వసతులు ఇచ్చి ఎంక్వయిరీ చేస్తే బాగుంటుందని డబల్ బెడ్ రూమ్ వాసులు అంటున్నారు,

బ్లాక్ ఇన్చార్జిలు ఇష్ట రాజ్యం….

కొంత మంది బ్లాక్ ఇన్చార్జిలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు తమ బ్లాక్ లో ఉన్న ప్లాట్ ఓనర్స్ కు కనీస సమాచారం ఇవ్వకుండా ఎంక్వయిరీలకు వచ్చినప్పుడు తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లు రాపించుకొని వీళ్లే ఉంటున్నారని ఎంక్వయిరీ వాళ్లకి చెప్పడంతో అనేకమంది తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు అసలు బ్లాక్ ఇన్చార్జిలే చాలా బ్లాక్స్ లో నివాసం ఉండడం లేదు.. ప్రతి బ్లాక్ లో మెయింటెనెన్స్ పేరిట ప్రతి ఫ్లాట్ నుండి కొంత మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు, వచ్చిన డబ్బుని ఏం ఖర్చు చేశారు ఎంత మిగిలింది ఇంకేం చేస్తున్నారు ఎటువంటి సమాచారం ఆ బ్లాకు సభ్యులకు తెలియజేయడం లేదు.. ఇప్పటికైనా ఎవరైతే బ్లాక్ ఇన్చార్జిలు తమ బ్లాక్ని పట్టించుకోకుండా వున్నారో వారు ఇకనైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఏదైనా సమాచారం ఉంటే బ్లాక్ లో ఉన్న వాళ్ళందరికీ తెలియజేయాలని ప్లాట్లు ఉన్నవారు కోరుకుంటున్నారు, అంతేకాకుండా బ్లాకు లో ఉన్న సమస్యలు తీర్చడానికి బ్లాక్ ఇన్చార్జిలు కృషి చేయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *