- సీజ్ చేసిన ఎంఇఓ బాపిరెడ్డి

ఉప్పల్ న్యూస్ – అనుమతులు లేకుండా స్కూల్ నడుపుతున్న సెంటెన్స్ స్కూల్ వద్ద ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ధర్నా నిర్వహించారు.విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న స్కూల్ నీ వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.ఎట్టకేలకు సెంటెన్స్ స్కూల్ ను మంగళవారం కాప్రా ఎంఈఓ బాపిరెడ్డి సీజ్ చేసారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తో పాటు కార్పొరేటర్లు స్కూలు ఎదుట సుమారు రెండు గంటల ధర్నా చేశారు. పోలీసుల జోక్యంతో స్కూల్ లో ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలతో తోపాటు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారితో ఫోన్ లో మాట్లాడి స్కూలు సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆందోళన విరమించారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి , ప్రభుదాస్ ,సాయి జెన్ శేఖర్ బి ఆర్ స్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.