
చిల్కానగర్ న్యూస్ – చిలుక నగర్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల కోసం నూతన భవనం ఏర్పాటు కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ యోగిత రాణా ని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చిలుక నగర్ ప్రభుత్వ పాఠశాలలోఅదనపు తరగతి గదుల నిర్మాణం కోసం స్కూల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నర్సింహా రెడ్డి ని గతంలో కలవగా నూతన భవనం ఏర్పాటు కోసం 23.6 లక్ష ల రూపాయల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఈ సందర్భగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయాన్ని స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తన దృష్టికి తీసుకురాగా మంగళవారం నాడు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు వచ్చిన ఫైల్ ని వెంటనే సాంక్షన్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి యోగితా రానా ని కోరడం జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రానా సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరలో బడ్జెట్ అప్రూవల్ చేయించి శాంక్షన్ కి పంపుతానని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు