
రామంతపూర్ న్యూస్ – రామంతపూర్ డివిజన్ పరిధిలోని బాలకృష్ణానగర్ డ్రైనేజీస్ సమస్య వెంటనే పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో వాటర్ వర్క్స్ జీఎం సంతోష్, అధికారులతో ఎమ్మెల్యే సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంక్షన్ అయిన వెంటనే డ్రైనేజీ పనులు చేపట్టాలని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు.