
రామంతపూర్ న్యూస్ – అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంటూ రామంతాపూర్ ఇందిరా నగర్ లో రామంతాపూర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్ రావు ఇంటి వద్ద బాలకృష్ణ నగర్ కాలనీ వాసుల నిరసన తెలియజేశారు .తమ కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ అభివృద్ధికోసం 72లక్షల రూపాయల పనులు సాక్షన్ అయితే ఆ పనులను స్థానిక బీజేపీ కార్పొరేటర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఇంటి వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ…రామంతాపూర్ డివిజన్ లోని బాలకృష్ణ నగర్ కు డ్రైనేజీ లైన్ లేనందున స్థానిక కార్పొరేటర్ నుండి మొదలు సీఎం, పీఎం, రాష్ట్రపతి వరకు సమస్యను తీసుకెళ్ళమని, సమస్యను గుర్తించి 72లక్షల పనులు సాంక్షన్ అయ్యాయి.కానీ స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆ పనులను అడ్డుకుంటున్నారని అందుకే కార్పొరేటర్ ఇంటి వద్ద నిరసనకు దిగినట్లు వారు తెలిపారు.బీజేపీ యువ మోర్చా నేతలు కూడా బీజేపీ కార్పొరేటర్ ఇంటి ముందు ధర్నాకి దిగారు..కార్పొరేటర్ గెలుపు కోసం కృషి చేసినందుకు మా అభివృద్ధి పనులను అడ్డుకుంటారా అంటూ ఆ కాలనీవాసులతో పాటు, యువమోర్చా బిజెపి నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..