- X, XII తరగతుల విద్యార్థులు ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత

నాచారం న్యూస్ – ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం విద్యార్థులు X మరియు XII తరగతుల ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.బుధవారం నాడు పాఠశాల యాజమాన్యం 10వ తరగతి మరియు 12వ తరగతి విద్యార్థులందరినీ మరియు 100% ఉత్తీర్ణత శాతం సాధించడంలో అవిశ్రాంతంగా కృషి చేసిన ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందించింది XIIలో పాఠశాల టాపర్లు సైన్స్ టాపర్ హర్షవర్ధన్ రవిచందర్ 97.4%, మరియు హ్యుమానిటీస్ టాపర్ మహతి పూజారి 97%కామర్స్ టాపర్ అదితి పి 96.6% సాధించారు వీరిని పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు పాఠశాల ఫలితాల్లో 15 మంది విద్యార్థులు 95% మరియు అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించారు,65 మంది విద్యార్థులు 90% మరియు అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించారు,195 మంది విద్యార్థులు 80% మరియు అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించారు అని స్కూల్ యాజమాన్యం తెలిపారు అంతేకాకుండా 316 మంది విద్యార్థులు 70% మరియు అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించారు అని తెలిపారు372 మంది విద్యార్థులు 60% మరియు అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించారు అని తెలిపారు వివిధ సబ్జెక్టులలో 18 మంది విద్యార్థులు సెంటంలు సాధించారు – జాతీయ ర్యాంకులుపెయింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్, బిజినెస్ స్టడీస్, అకౌంటెన్సీ, సైకాలజీ, ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీసెస్, యోగా, ECCEవిద్యార్థులు వృత్తి నైపుణ్యాల సబ్జెక్టులలో FMM, మాస్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యోగా మరియు ECCEలలో అసాధారణ ప్రతిభ కనబరిచారని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ టి. పద్మ జ్యోతి తెలిపారు