
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ జాతీయ రహదారి పై ఇంటర్నేషనల్ స్టేడియం సమీపంలో డ్రైనేజీ గత నెలరోజులుగా పొంగిపొర్లుతున్నది డ్రైనేజీ నుంచి వచ్చే నీటితో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతున్నది ముఖ్యంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొద్దిపాట వర్షం వస్తే చాలు రోడ్డంతా ఈ డ్రైనేజీ నీటితో నిండిపోయి మోకాళ్ళ లోతు నీళ్లు ఉండడం వల్ల అనేక వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు నిత్యం ఆ దారి గుండా అనేకమంది ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రయాణిస్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు, ఒకపక్క ఐపిఎల్ మ్యాచ్లు జరుగుతున్న స్టేడియం సమీపంలో ఉండడం వల్ల మ్యాచ్కు వచ్చే ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు