
ఉప్పల్ న్యూస్ – హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను బుద్ద భవన్ లో మర్యాద పూర్వకంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు ఇతర నాయకులతో కలిసి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామాంతపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువుల్లో సుందరీకరణ పూడిక తీత గురించి చర్చించడం జరిగింది. దానికి నుకూలంగా స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ రేపు వచ్చి చెరువులను సందర్శిస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు గంధం నాగేశ్వర్ రావు, కాలేరు నవీన్, హబ్సిగూడ వాసులు తదితరులు పాల్గొన్నారు.