సీ ఉగాది పురస్కారాలు శ్రీ సీతారామ కళ్యాణ బ్రోచర్ ఆవిష్కరణ

Oplus_16908288
  • సి జాతీయ అధ్యక్షులు డాక్టర్ సత్యం శ్రీరంగం ఇందుమతి..
  • కన్వీనర్ ఆర్సి మూర్తి, సీ వ్యవస్థాపకులు ముళ్ళపూడి అమృత్..
  • రాష్ట్ర అధ్యక్షులు సాయి ప్రసాద్, శరన్, శ్రీనివాస్, గౌతమ్ తదితరులు హాజరు

హైదరాబాద్ – సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ (సీ)ఆధ్వర్యంలో శ్రీ సీతరామచంద్ర స్వామి కళ్యాణంతో పాటు ఉగాది పురస్కారాలు టీపీసీసీ అధికార ప్రతినిధి, సీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సత్యం శ్రీరంగం అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ మేరకు వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ప్రముఖ వ్యక్తులకు సన్మానాలు, అవార్డ్స్, రివార్డ్స్ టీపీసీసీ అధికార ప్రతినిధి, సీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సత్యం శ్రీరంగం చేతుల మీదుగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పురస్కారాల 2025 ప్రధానోత్సవ బ్రోచర్ ని ఆవిష్కరించడం జరిగింది. టీపీసీసీ అధికార ప్రతినిధి, ఈ సందర్భంగా ఇందుమతి సత్యం శ్రీరంగం దంపతులు మాట్లాడుతూ.. ఈ నెల 5న ఉప్పల్ భాగయత్ లోని శ్రీరస్తు కన్వెన్షన్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ వారి మంగళ శాసనాలతో స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం అనంతరం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఉగాది వేడుకల సంబరాలు పురస్కరించుకొని బ్రాహ్మణ సమాజానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఇతర రంగాలలో విజయం సాధించిన ప్రముఖ వ్యక్తులను సన్మానించడం జరుగుతుందని తెలిపారు.కాబట్టి ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సోదరీ సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఉగాది పురస్కారాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉగాది పురస్కారాల కన్వీనర్ ఆర్ సి మూర్తి, సీ వ్యవస్థాపకులు ముళ్లపూడి అమ్రిత్, సీ తెలంగాణ అధ్యక్షులు సాయి ప్రసాద్, సమన్వయకర్త శరన్ కండల, జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ పీసపాటి, శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్‌పర్సన్ ఇందుమతి శ్రీరంగం, మహిళా విభాగం కార్యదర్శి శిరీష పుల్లే, రాజ్య లక్ష్మి యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గౌతమ్ వలివేటి, శశి హరి, పవన్, లక్ష్మి మోహన్ తదితలులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *