సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు సురేష్ గుండెపోటుతో మృతి

ఉప్పల్, మే 31 సీనియర్ జర్నలిస్టు మాదిరాజు సురేష్ (52) శనివారం ఉదయం నివాసంలో పూజ చేస్తూ కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని టి ఎక్స్ హాస్పిటల్ కి తరలించగా అతనికి గుండెపోటు రావడం వల్లే మరణించినట్లుగా హాస్పిటల్ వైద్యులు దృవీకరించారు. ఉప్పల్ ప్రాంతంలో మూడు దశాబ్దాల పాటు జర్నలిస్టుగా సురేష్ పనిచేసి ప్రజలకు విశేష సేవలందించి మన్ననలు పొందారు. పార్థివ దేహాన్ని కళ్యాణపురిలోని అతని నివాసానికి తరలించి సందర్శకుల నిమిత్తం వారి నివాసం వద్ద ఉంచారు. రాష్ట్ర బి ఆర్ ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ నివాళులు అర్పించి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు సురేష్ అంతక్రియలకు ఆర్థిక సహాయాన్ని అందించారు.మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, గొర్రెగె కృష్ణ, రావుల బాలకృష్ణ గౌడ్, సతీష్, సుమన్ శర్మ, శ్రీనివాస్ శర్మ, రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారి వెంకట్రావు ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు మార్నిని ఫణిందర్, బిజెపి సీనియర్ నాయకులు షామీర్పేట ధర్మారెడ్డి, పరమేష్ సింగ్, దేవసాని బాలచందర్, గోనే శ్రీకాంత్, కొల్లు బాలరాజు , రామరాజు యాదవ్, బోరంపేట మురళీకృష్ణ, బిఆర్ఎస్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి, పంగా మహేందర్ రెడ్డి, ఈరెల్లి రవీందర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు పబ్బితి శేఖర్ రెడ్డి సురేష్ పార్టీవ దేహానికి నివాళులర్పించారు. సురేష్ ను ఆసుపత్రికి తరలించిన నుండి వారి స్వగ్రామం వైరా మండలం దాచాపురం గ్రామానికి పార్థివ దేహాన్ని సాగ నంపే వరకు దగ్గరుండి ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *