ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి కోరారు. సీఎం రేవంత్‌రెడ్డిని పరమేశ్వర్‌రెడ్డి కలిసి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, వాటికి కావాల్సిన నిధుల గురించి వినతి పత్రం అందచేశారు.నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణ చేపట్టాలని కోరారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చాలన్నారు. అవసరమైన కాలనీలలో సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. రాజీవ్ యవ వికాసం పథకం కింద అర్హులైన యువతకు అవకాశం కల్పించి స్వయం ఉపాధి రంగాలలో రాణించేలా ప్రొత్సాహించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పరమేశ్వర్‌రెడ్డికి సూచించారు. సన్నబియ్యం పథకానికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని ఈ సందర్భంగా పరమేశ్వర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన పరమేశ్వర్‌రెడ్డి
