ఉప్పల్ – రాష్ట్రంలో సన్న బియ్యం పథకం అమలు పేదలకు వరమని ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి , ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పథకం అమలు జరిగిందన్నారు. ఉప్పల్ నియోజకవర్గం వ్యాప్తంగా సన్న బియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమం మంగళవారం పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల్ భారత్ నగర్ లో బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ,ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియమ్మ, రాహుల్ గాంధీ ఆలోచనలతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలలో సువర్ణ పాలనను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినే విధంగా సన్న బియ్యంను అందించాలనే గొప్ప ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేసి ఉగాది పర్వదినాన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్ ,లింగంపల్లి రామకృష్ణ ,బజార్ జగన్నాథ్ గౌడ్ ,దేవి రెడ్డి , పాశికంటి నాగరాజ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఈగ శంకర్, గొర్రె మహేష్, కోమటి రెడ్డి కృష్ణారెడ్డి, నాగారం వెంకటేష్, పూజారి హనుమంతు, మహంకాళి రాజు ,రామ్ రెడ్డి ,ప్రేమ్, సుఖ జీవన్, బొడిగ మల్లేష్, బకరం అరుణ్, బజార్ నవీన్ గౌడ్,ప్రశాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, హరిబాబు ,కావాలి రామ్ ,రంగుల శేఖర్ ,బచ్చ రాం పాల్గొన్నారు
సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం – మందుముల పరమేశ్వర్ రెడ్డి
