ఉప్పల్ న్యూస్ – జ్యోతిరావు పూలే 198 జయంతిని పురస్కరించుకొని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి సైనిక్పురి మరియు మల్లాపూర్ చౌరస్తాలలో నీ పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ విద్యావ్యక్తి ద్వారా కుల వివక్షతను సాంఘిక దురాచారాలను మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని, స్త్రీ విద్యా వికాసానికి బాటలు వేసిన మహానీయుడు పూలే అని కొనియాడారు నివాళులర్పించిన వారిలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, సీనియర్ నాయకులు సైజన్ శేఖర్ ,నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నార.
విద్య తోనే మనిషి మహనీయుడు అవుతాడు : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
