ఉప్పల్ -రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఉప్పల్లోని స్వర్గీయ బుడే సాహెబ్ తనయుడు (మున్నా) మదర్ వలి నివాసం వద్ద పేదలకు బట్టలు పంపిణీ చేశారు ఉప్పల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బజార్ మురళి గౌడ్, వినోద్ ముదిరాజ్ లు మదర్ వలి కుటుంబ సభ్యులతో కలిసి పేదలకు బట్టలు పంపిణీ చేశారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని ఈ మాసంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, అత్యంత భక్తితో చేసుకునే పండుగ రంజాన్ అని నేతల తెలిపారు ఈ సందర్భంగా మదర్ వలి ఆయన తండ్రి బుడే సాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని వారు అభినందించారు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిరుపేదలకు బట్టలు పంపిణీ చేసిన మదర్ వలి
