రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఉప్పల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు సోదరీమణులకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ పవిత్రతకు ,త్యాగానికి చిహ్నమని అన్నారు. సేవా దృక్పథాన్ని, సోదర భావాన్ని, మత సామరస్యాన్ని చాటి చెప్పే రంజాన్ పర్వదిమాన్ని ముస్లిం సోదరులు సంతోషం గా నిర్వహించుకోవాలని కోరారు.
నెల రోజులు కఠిన దీక్షలు పూర్తి చేసుకుని రంజాన్ పండుగ చేసుకుకోవడం,శాంతి మార్గం,పేదవారికి సాయం చేయడం అల్లా మనకి చూపిన మార్గం
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర ‘రంజాన్ మాసం’. ఈ పుణ్యమాసంలో అత్యంత నిష్టగా ఉపవాస దీక్షను ముగించుకుని, ఈ రోజు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తూ.
ఈ రంజాన్ శుభాలను, ఆనందాలను పంచివ్వాలని. మీకు, భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను,అష్టైశ్వర్యాలను, సుఖసంతోషాలను, ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు – ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
