మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

— జూన్ 9, 10 తేదీలలో రెండు రోజుల శిక్షణ

— జిల్లా జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి – విజ్ఞప్తి చేసిన జిల్లా కమిటీ

మేడ్చల్ – మేడ్చల్ జిల్లా జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి కి సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, కార్యదర్శి వెంకట్రాంరెడ్డి లు వినతిపత్రం అందజేశారు. జూన్ 9, 10 వ తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 50 మంది జర్నలిస్టులకు నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు రోజులపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు ప్రొఫెసర్లతో, సీనియర్ జర్నలిస్టులతో తరగతులు జరుగుతాయని అన్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనాలను మీడియా అకాడమీ ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. రెండు రోజులు శిక్షణ పొందిన వారికి మీడియాకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను కూడా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి అధ్యక్షులు ఎంఏ కరీం, ఉప్పల్ నియోజకవర్గం యూనియన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు తిరుపతి రెడ్డి, నరోత్తం రెడ్డిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *