
బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ ప్రధాన కూడలిలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతుడు, మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్. బాబు జగ్జీవన్ రామ్ దళితుల కోసం మాత్రమే కాకుండా ఇతర వర్గాల కోసం పార్లమెంట్ లో ఎనలేని కృషి చేసి చరిత్రలో నిలిచి పోయిన మహా నాయకుడని అన్నారు. ఆయన దేశ వ్యాప్తంగా నాయకులకు మరియు ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వంజరి ప్రవీణ్ కరిపే, గుమ్మడి జంపాల్ రెడ్డి, శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, నవీన్ గౌడ్, పూస రమేష్, రామకృష్ణ, దేవేందర్ కుమార్, భూపతి అశోక్, రాంచర్ల బాల నరసింహ, కొయ్యడ జయపాల్, కిరణ్, కుమార్, తిరుపతి, అజయ్, సలీం, నిసార్ అహ్మద్ గోరి, దండెం నరేందర్ మరియు మహిళా నాయకులు భాగ్యమ్మ, జ్యోతి, భారతి తదితరులు పాల్గోన్నారు.