
బాబుజి జగ్జీవన్ రామ్ 117 వ జయంతిని పురస్కరించుకొని చిలుకానగర్ డివిజన్లోని షెడ్యూల్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేసిన మహోన్నతుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ దళితుల కోసం మాత్రమే కాకుండా ఇతర వర్గాల కోసం పార్లమెంట్లో ఎనలేని కృషిచేసి చరిత్రలో తనదైన ముద్ర వేసుకొన మహా నాయకుడు అని కొనియాడారు. తన 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయములు ఎన్నో పదవులు అధిరోహించారని క్యాబినెట్ హోదాలో ఎన్నో సంస్కరణలు చేశారని అటువంటి మహనీయుని ఆశయాలను కొనసాగించే విధంగా మనమందరం కృషి చేయాలని అన్నారు.