- ప్రభుత్వ స్థలాల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటాం
- ఉప్పల్ సర్వేనెంబర్ 789/1లో ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

ఉప్పల్ న్యూస్ – ప్రభుత్వ స్థలాల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ తాసిల్దార్ వాణిరెడ్డి పేర్కొన్నారు,ఉప్పల్ తాసిల్దార్ వాణిరెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ ఆర్,ఐ సామ్సన్ పాల్,జూనియర్ అసిస్టెంట్ వెంకన్న,అలివేలు ఇతర అధికారులు బుధవారం ఉప్పల్ మండల పరిధిలోని ఉప్పల్ లోని హై కోర్టు కాలనీలోని సర్వేనెంబర్ 789/1లో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది, ఉప్పల్ లోని హైకోర్టు కాలనీలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు రెవెన్యూ నడుం బిగించింది,బోర్డులను తొలగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఉప్పల్ తాసిల్దార్ వాణి రెడ్డి హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు,