
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు సుదీర్ఘ మైన ఆరోగ్య సేవలు అందించి ఆరోగ్య విస్తరణ అధికారి (Heàlth Extention Officer) గా పదోన్నతి పై వెళుతున్న బోగా ప్రకాష్ వైద్య సిబ్బంది అభినందించారు. ఆయన చేసిన సేవలు కొనియాడుతూ ముఖ్యంగా కరోనా సమయంలో భోగా ప్రకాష్ అందించిన సేవలు ఉప్పల్ ప్రజలు మరచి పోలేరు అని ప్రశంసించారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఉప్పల ప్రజల మన్ననలు పొందినారు.