
ఉప్పల్ న్యూస్ – నిబద్ధత కలిగిన నాయకుడు తన సోదరుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డిని కోల్పోవడం బాధాకరం అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.శుక్రవారం ప్రశాంత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సంతాప సభలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూతన సోదరుడు దివంగత నేత బండారి రాజిరెడ్డి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు.ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి అని ఆయన అన్నారు.తను కూడా తన సోదరుని బాటలో నడుస్తూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ అభ్యర్థి క్యామ మల్లేష్ కురుమ, చిల్కానగర్ డివిజన్ లోనీ వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వారి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, చిల్కానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు, రాజి రెడ్డి అభిమానులు, మహిళలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.