
ఉప్పల్ న్యూస్- హబ్సిగూడ డివిజన్ వెంకట్ రెడ్డి నగర్ లో త్రిశక్తి నల్ల పోచమ్మ దేవాలయానికి ఓంకారం సంతోష్ రాజు ధర్మపత్ని వీణ 25 వేల రెండు రూపాయలు ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి దేవాలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరారు.ఈ సందర్భంగా సంతోష్ రాజు మాట్లాడుతూ హిందువుల దేవాలయాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన హిందువుల పై ఉందన్నారు. ఎక్కడ చిన్న దేవాలయం ఉన్న దానిని స్థానికంగా ఉన్న ప్రజలు పలుకుబడి ఉన్న మహానుభావులు ఆలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. మన దేశంలోని చిన్న పెద్ద దేవాలయాలకు ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని దేవతలు ప్రత్యక్షమై ప్రజల మొక్కులను తీర్చిన ఆలయాలు ఎన్నో ఉన్నాయన్నారు. అందుకోసమే ప్రతి హిందువు తన సంపాదనలో 10 శాతం దానధర్మాలకు దేవాలయాల అభివృద్ధికి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గడ్డం సాయికిరణ్, అధ్యక్షులు సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి, మరియు హరీష్ చారి, హరీష్,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.