
ఉప్పల్ న్యూస్ – మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ మనూ చౌదరి అధ్యక్షతన జరిగిన దిశ కమిటీ మీటింగ్ లో దిశ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సహచర ఎమ్మెల్యేలు తో కలిసి పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ఆయన దిశ సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గం లోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు ఉప్పల్ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అలాగే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కి స్థలం కేటాయించాలని కోరారు అలాగే మధ్యాహ్న భోజన పథకం లో పనిచేసే వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని వేరే స్కూల్ పేర్లు పెడుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న వారి పర్మిషన్ రద్దు చేయాలని కోరారు అలాగే డబుల్ బెడ్ రూం లో లిఫ్ట్ లు పనిచేయడం లేదు అని అక్కడ నివసిస్తున్న వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు, ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.