తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరమ్ కు తెలంగాణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నాగరాజు నాదెండ్ల నియామకం

హైదరాబాద్ ఫిబ్రవరి 20- తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న తెలంగాణ హ్యూమన్ రైట్ జస్టిస్ ఫోరమ్ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నాగరాజు నాదెండ్లను నియమించినట్లు సంస్థ ఛైర్పర్సన్ డాక్టర్. వ్యాసభట్ శ్రీవాణి చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు నాగరాజు నాదెండ్ల సంస్థలో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా నియమితులైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఛైర్పర్సన్ డాక్టర్. వ్యాసభట్ శ్రీవాణి చౌదరి , మా నియామకానికి కృషి చేసిన జట్ల పద్మావతి ,జనరల్ సెక్రటరీ తెలంగాణ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం నా శక్తి మేరకు పనిచేస్తానని స్పష్టం చేశారు. బాధితులకు అండగా నిలిచి, న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.“సంస్థ అభివృద్ధికి సద్వ్యవస్థాపకతతో పనిచేస్తానని వెల్లడించారు. హక్కులు భంగమవుతున్న ప్రతిసారి తెలంగాణ హ్యూమన్ రైట్ జస్టిస్ ఫోరమ్ తరఫున గట్టిగా స్పందించి అవసరమైన కార్యక్రమాలు చేపడతానన్నారు. నా నియామకం సామాజిక బాధ్యతను మరింత పెంచినట్లుంది,” అని వారు అన్నారు.ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు, స్థానిక ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు నూతనంగా నియమితులైనతెలంగాణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగరాజు నాదెండ్లను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *