
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ నియోజకవర్గం లోని చిల్కానగర్ డివిజన్ లో కార్పొరేటర్ కార్యాలయంలో జిహెచ్ఎంసి పారిశుధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ మరియు డి చందన తో కలిసి పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయమని వారు చేసే సేవకు ఎంత ఇచ్చిన తక్కువే అని, శానిటేషన్ సిబ్బంది ఒక్కరోజు లేకున్న హైదరాబాద్ హస్త వ్యస్తం అవుతుందని వారితో ప్రతి ఒక్కరు కూడా గౌరవంతో మెలగాలని కొనియాడారూ.కార్యక్రమంలో సానిటేషన్ సిబ్బంది, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొదలగువారు పాల్గొన్నారు.