ఘనంగా బిజెపి సీనియర్ నాయకులు కొల్లు బాలరాజ్ కురుమ జన్మదిన వేడుకలు

  • జన్మదినo సందర్భంగా సేవా కార్యక్రమాలు
  • పారిశుధ్య కార్మికులకు సత్కారం
  • పిల్లలకు ఉచ్చిత కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ
  • పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లు బహుకరణ
Oplus_16908288

ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొల్లు బాలరాజ్ కురుమ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా పారిశుధ్య కార్మికులను సత్కరించారు.
ఈ సందర్భంగా కొల్లు బాలరాజ్ కురుమ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఆరోగ్య, పారిశుద్య పరిరక్షణలో నిత్యం సేవలు అందిస్తున్నారని,
పారిశుధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారి అభివృద్ధికి సహకరించాలన్నారు.
అనంతరం కొల్లు బాల్ రాజ్ కురుమ
జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉప్పల్ నందు విద్యార్థులతో వారి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లు బహుకరించారు అనంతరం
జన్మదినాన్ని పురస్కరించుకుని ఉప్పల్ జిల్లా పరిషత్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న పిల్లలకు ఉచ్చిత కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు అందజేశారు ఈ సందర్భంగా బాలరాజును వివిధ పార్టీల నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *