- ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ – హబ్సిగూడ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ ని నరేందర్ రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మ దిన వేడుకల్లో ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను తీర్చడంలో కార్యకర్తలు ముందుండాలని, రాజకీయ పార్టీలకతీతంగా ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని, కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఇలాంటి జన్మదిన వేడుకలను నరేందర్ రాజు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి,డాక్టర్ బి వి చారి, కైలాస్పతి గౌడ్, కంచర్ల సోమిరెడ్డి, కాలేరు నవీన్, యాకాంతరావు, వీరేందర్, హరీష్ చారి, అక్బర్, దినేష్, కైసర్ ,దశరథ్, ఖదీర్, రమేష్, లింగా నాయక్, మహేందర్, అబ్బో, శంకర్, మరియు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.