
ఉప్పల్ న్యూస్ – కురుమ సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.ఆదివారం చిలుక నగర్ డివిజన్ పరిధిలోని బీరప్ప గడ్డ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న భవన నిర్మాణం వద్ద జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొని నిర్మాణానికి సంబంధించిన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.